కువైట్ లో ప్రవాసుల అప్పులు అర బిలియన్ దినార్లు..!
- September 08, 2023
కువైట్: కువైట్ రాష్ట్రానికి విదేశీయులు చెల్లించాల్సిన మొత్తం అప్పులు, జరిమానాలు, సేవా రుసుములు దాదాపు అర బిలియన్ దినార్లు ఉంటుందని ఓ నివేదిక తెలిపింది. విదేశీయులు దేశం విడిచి వెళ్ళే ముందు వారి రుణాలను తప్పనిసరిగా చెల్లించాలని ఇటీవల మంత్రిత్వ శాఖలు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ ఆదేశాలతో ప్రవాసులు ప్రయాణానికి ముందు జరిమానా క్లియర్ చేయడాన్ని తప్పనిసరి చేశాయి మంత్రిత్వ శాఖలు. ఈ బకాయి వసూళ్లు ప్రభుత్వ సంస్థల మధ్య సంబంధాన్ని వేగవంతం చేయడానికి,వాటి మధ్య సమన్వయాన్ని పెంపొందించడానికి దోహదం చేస్తుందని అధికార యంత్రాంగం వెల్లడించింది. ప్రస్తుతం ట్రాఫిక్ విభాగం, విద్యుత్, నీటి మంత్రిత్వ శాఖ, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖతో సహా నాలుగు ప్రభుత్వ సంస్థలు విదేశీయులు ప్రయాణించే ముందు వారి నుండి బకాయి మొత్తాన్ని వసూలు చేయడానికి ఒకే నెట్ వర్క్ ను ఏర్పాటు చేశాయి. త్వరలోనే ఆరోగ్య మంత్రిత్వ శాఖ, కువైట్ మునిసిపాలిటీ, వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఎన్విరాన్మెంట్ పబ్లిక్ అథారిటీ, ఇతర సంస్థలు ఈ జాబితాలో చేరతాయని నివేదికలో అభిప్రాయపడ్డారు. అనేక మంది ప్రవాసులు వివిధ మంత్రిత్వ శాఖలకు బకాయి మొత్తాన్ని చెల్లించకుండా శాశ్వతంగా దేశం విడిచిపెట్టినందున సంవత్సరంలో ప్రవాసులు 3 బిలియన్ దినార్లకు పైగా డిఫాల్ట్ పడ్డారని నివేదిక స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







