బహ్రెయిన్ లో పెరుగుతున్న కార్లలో వాపింగ్ ధోరణి..ఆరోగ్య నిపుణుల హెచ్చరికలు..!
- September 08, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్‌లో కార్లలో వాపింగ్ చేసే పెద్దలు, యువకులు సంఖ్య ఇటీవల భారీగా పెరుగుతున్నది. కొన్ని సందర్భాల్లో కార్లలో పిల్లల ముందే వాపింగ్ చేయడం పెరుగుతుంది. ఇటువంటి ప్రవర్తన పిల్లలను హానికరమైన అలవాట్లకు ప్రేరేపితం చేస్తుందని, దాంతో అభివృద్ధి చెందుతున్న శరీరాలకు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కూడా కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. సాంప్రదాయ సిగరెట్ వలె శరీరానికి హానికరం కానప్పటికీ ఇ-సిగరెట్లు కూడా విషపూరిత పదార్థాలను కలిగి ఉంటాయి. అలాగే చుట్టుపక్కల గాలి నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఇ-సిగరెట్లు హానికరమైన రసాయనాలను విడుదల చేస్తాయని బహ్రెయిన్ స్పెషలిస్ట్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ షామిల్ పికె తెలిపారు. ఇ-సిగరెట్ ఉద్గారాలలో హానికరమైన పదార్థాలు ఉన్నాయని అధ్యయనాలు నిరూపించాయి, ఇవి వాపింగ్ చేసే వ్యక్తి చుట్టూ ఉన్న గాలి నాణ్యతను దెబ్బతీస్తాయి, తద్వారా వారి చుట్టూ ఉన్న వ్యక్తులపైనా ఇది ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఇ-సిగరెట్ నుండి వచ్చే ఆవిరిలో పార్టిక్యులేట్ మ్యాటర్ (పిఎమ్) 2.5, పిఎమ్ 10, అనిచ్చిత కర్బన సమ్మేళనాలు (టివిఒసి), కార్బన్ డయాక్సైడ్, ప్రొపైలిన్ గ్లైకాల్, హెవీ మెటల్స్, నికోటిన్ ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయని డాక్టర్ చెప్పారు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, గుండె లేదా ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు వాపింగ్ చేసే వారు దూరంగా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







