టైమ్ టాప్ 100 ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో యూఏఈ మంత్రి..!

- September 08, 2023 , by Maagulf
టైమ్ టాప్ 100 ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో యూఏఈ మంత్రి..!

యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో యూఏఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఎకానమీ,  రిమోట్ వర్క్ అప్లికేషన్స్ మంత్రి ఒమర్ సుల్తాన్ అల్ ఒలామా స్థానం సంపాదించారు.  టైమ్ మ్యాగజైన్ తొలిసారి కృత్రిమ మేధస్సు (AI) కోసం ప్రపంచంలోనే తొలిసారిగా ప్రభావవంతమైన వ్యక్తులతో జాబితాను ప్రకటించింది. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రభావంతమైన వ్యక్తుల జాబితాలో స్థానం పొందిన  ఒమర్ సుల్తాన్ అల్ ఒలామాను ప్రశంసించారు. ఇంకా ఈ జాబితాలో అల్ ఒలామాతో పాటు అమెరికా ప్రతినిధులు అన్నా ఎషూ,  టెడ్ లియు, యూకే AI ఫౌండేషన్ మోడల్ టాస్క్‌ఫోర్స్ చైర్ పర్సన్ ఇయాన్ హోగార్త్ ఉన్నారు. వీరితోపాటు ఎలోన్ మస్క్, సామ్ ఆల్ట్‌మాన్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ సీఈఓ అండ్  సహ వ్యవస్థాపకుడు రుమ్మన్ చౌదరి, ప్రముఖ నిపుణులు అబేబా బిర్హానే, ఎన్‌కోడ్ జస్టిస్‌కు నాయకత్వం వహించిన 18 ఏళ్ల స్నేహ రేవనూర్, ఇటీవల గూగుల్ ను వదిలిన 76 ఏళ్ల జెఫ్రీ హింటన్ కూడా జాబితాలో ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com