సౌదీ, జపాన్ మధ్య కుదిరిన వ్యూహాత్మక ఒప్పందం
- September 08, 2023
రియాద్: సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ బిన్ అబ్దుల్లా గురువారం రియాద్‌లోని తన కార్యాలయంలో జపాన్ కౌంటర్ యోషిమాసా హయాషిని కలుసుకున్నారు. సౌదీ-జపానీస్ విదేశాంగ మంత్రుల వ్యూహాత్మక చర్చలకు సంబంధించి ఇరు పక్షాలు అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి.ఇది రెండు దేశాలు, వారి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుందిని అధికార యంత్రాంగం పేర్కొంది. సౌదీ-జపానీస్ విదేశాంగ మంత్రుల వ్యూహాత్మక చర్చల మొదటి సమావేశానికి ఇద్దరు మంత్రులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలు, నిరంతర సమన్వయం-సహకారంపై చర్చించారు. రాజకీయ వ్యవహారాల విదేశాంగ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ సౌద్ అల్-సతీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఆసియా దేశాల జనరల్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ మహ్మద్ అల్-మత్రాఫీ, సౌదీ అరేబియాలోని జపాన్ రాయబారి ఫుమియో ఇవై ఈ సమావేశానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







