నేరాలను ఎదుర్కోవడానికి ఒక్కటైన నజాహా, ఇంటర్‌పోల్..!

- September 09, 2023 , by Maagulf
నేరాలను ఎదుర్కోవడానికి ఒక్కటైన నజాహా, ఇంటర్‌పోల్..!

లియోన్, ఫ్రాన్స్: ఓవర్‌సైట్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) అధ్యక్షుడు మజిన్ బిన్ ఇబ్రహీం అల్-కహ్మౌస్ శుక్రవారం ఫ్రాన్స్‌లోని లియోన్‌లోని ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ (ఇంటర్‌పోల్) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఇంటర్‌పోల్ సెక్రటరీ జనరల్ జుర్గెన్ స్టాక్, సంస్థ సీనియర్ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ఇరుపక్షాలు ఉమ్మడి ఆసక్తి ఉన్న అనేక అంశాలపై చర్చించాయి. అవినీతి మరియు సరిహద్దు నేరాలను ఎదుర్కోవడంపై నజాహా, ఇంటర్‌పోల్ చర్చించాయి.  అవినీతి కేసులకు సంబంధించిన నిధులు,  ఆస్తులను రికవరీ చేయడం, న్యాయస్థానం నుండి పారిపోయిన వ్యక్తులను పట్టుకోవడం, వారిని కోర్టుల ముందు తీసుకురావడానికి సహకరించడం వంటి అంశాలపై కూడా చర్చలు జరిగాయి. అవినీతి, అక్రమ నిధుల తరలింపు, వాటి పునరుద్ధరణపై పోరాటంలో సంస్థ చేపట్టిన చర్యల గురించి చర్చించడానికి నజాహా అధ్యక్షుడికి INTERPOL చీఫ్ ఆహ్వనం మేరకు నజాహా అధ్యక్షుడు పర్యటించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com