G20 సమ్మిట్ కోసం న్యూఢిల్లీకి చేరుకున్న యూఏఈ ప్రెసిడెంట్
- September 09, 2023
యూఏఈ: యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుక్రవారం భారతదేశంలోని న్యూఢిల్లీకి చేరుకున్నారు. భారత రాజధానిలో జరగనున్న జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఆయన వెళ్లారు. 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు' అనే థీమ్‌తో జరిగే 18వ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు భారత్ కు చేరుకుంటున్నారు. G20 అధ్యక్షుడి హోదాలో ఉన్న భారతదేశం ఆహ్వానం మేరకు అతిథి దేశంగా యూఏఈ ఈ సంవత్సరం శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటుంది. G20 దేశాలు యూఏఈ అతిపెద్ద వాణిజ్య భాగస్వాములుగా ఉన్నారు. చమురుయేతర ఎగుమతుల్లో 43 శాతం, దాని పునః-ఎగుమతుల్లో 39 శాతం వాటా కలిగి ఉన్నాయి.యూఏఈ కమోడిటీ దిగుమతుల్లో 67 శాతం వాటా కూడా వీరిదే కావడం గమనార్హం.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!