యూఏఈ తీరంలో కూలిన హెలికాప్టర్. పైలట్లు మృతి..!
- September 09, 2023
యూఏఈ : యూఏఈ తీరంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందినట్లు జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (GCAA)లోని ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ సెక్టార్ వెల్లడించింది. మృతుల కుటుంబానికి అధికార యంత్రాంగం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. సెప్టెంబర్ 7 రాత్రి 8.30 గంటలకు యూఏఈ తీరంలో హెలికాప్టర్ క్రాష్ అయినట్లు GCAA తెలిపింది. A6-ALD రిజిస్ట్రేషన్ మార్క్తో ఏరోగల్ఫ్ యాజమాన్యంలోని 'బెల్ 212' ఛాపర్ ఈజిప్టు, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన ఇద్దరు పైలట్లతో రాత్రి శిక్షణా సెషన్ లో ఉండగా గల్ఫ్ సముద్రంలో కూలిపోయిందని GCAA తెలిపింది. ఇది మొదట అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిందని పేర్కొంది. అధికార యంత్రాంగం శిథిలాల కోసం గాలిస్తుంది. అధికారిక మూలాల నుండి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, పుకార్లను నమ్మవద్దని, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం