మొరాకోలో 7 తీవ్రతతో భూకంపం. 296 మంది మృతి
- September 09, 2023
            మొరాకో: శుక్రవారం అర్థరాత్రి మొరాకోలోని హై అట్లాస్ పర్వతాలలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపంలో ఇప్పటివరకు 296 మందికిపైగా మరణించారు. హై అట్లాస్‌లోని ఇఘిల్ ప్రాంతంలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని మొరాకో జియోఫిజికల్ సెంటర్ తెలిపింది. యుఎస్ జియోలాజికల్ సర్వే భూకంప తీవ్రతను 6.8గా పేర్కొంది. భూకంప కేంద్రం18.5 కిమీ లోతులో ఉందని తెలిపింది. ఇఘిల్, చిన్న వ్యవసాయ గ్రామాలతో కూడిన పర్వత ప్రాంతం. మర్రకేచ్ నుండి నైరుతి దిశలో 70కి.మీ. రాత్రి 11 గంటల తర్వాత (యూఏఈ కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు) భూకంపం సంభవించింది. భూకంప తీవ్రతకు భవనాలు పేక మేడల్లా కుప్పకూలాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతు సంఖ్య ఇంక పెరిగే అవకాశం ఉందని ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. భూకంపం దాటికి అల్ హౌజ్, ఔర్జాజేట్, మర్రకేచ్, అజిలాల్, చిచౌవా మరియు తరౌడాంట్ ప్రావిన్సులు ధ్వంసం అయ్యాయని తెలిపింది. 2004లో ఉత్తర రిఫ్ పర్వతాలలో అల్ హోసీమా సమీపంలో వచ్చిన భూకంపంలో 600 మందికి పైగా మరణించిన భూకంపం తర్వాత మొరాకోలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం ఇదేనని స్థానిక అధికారులు చెబుతున్నారు. భూకంపం తర్వాత ప్రజలు షాపింగ్ సెంటర్, రెస్టారెంట్లు మరియు అపార్ట్‌మెంట్ భవనాల నుండి భయంతో బయటకు పరుగులు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
 - బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
 - ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
 - ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
 - బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
 - పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
 - రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
 - వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
 - ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
 - కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!
 







