యూఏఈని ఇండియా, సౌదీ అరేబియా, యూఎస్‌లకు కలిపే కొత్త షిప్పింగ్, రైల్ కారిడార్

- September 10, 2023 , by Maagulf
యూఏఈని ఇండియా, సౌదీ అరేబియా, యూఎస్‌లకు కలిపే కొత్త షిప్పింగ్, రైల్ కారిడార్

యూఏఈ: భారతదేశాన్ని యూఏఈ, సౌదీ అరేబియా, యూరప్, యుఎస్‌లకు అనుసంధానించే షిప్పింగ్ మరియు రైలు కారిడార్‌ను జి20లో నాయకులు ప్రకటించారు. ఢిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సులో శనివారం ఈ ప్రధాన ప్రకటన వెలువడింది. యుఎస్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జోన్ ఫైనర్ మీడియాతో మాట్లాడుతూ.. కారిడార్ ఇంధన వనరులు, డిజిటల్ కమ్యూనికేషన్ల రవాణాను మెరుగుపరచడం ద్వారా పాల్గొనే దేశాల మధ్య ఆర్థిక శ్రేయస్సును పెంచుతుందని అన్నారు. అమెరికన్ ప్రెసిడెంట్ బిడెన్ G20లో అభివృద్ధి చెందుతున్న దేశాలలో, ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భాగస్వామిగా, పెట్టుబడిదారుగా వాషింగ్టన్‌ ను నిలపాలన్న ప్రణాళికలలో  ఇది భాగమన్నారు.  దౌత్యపరమైన చిక్కులకు అతీతంగా, ఇటువంటి అవస్థాపన ఒప్పందం షిప్పింగ్ సమయం, ఖర్చు, డీజిల్ వినియోగాన్ని తగ్గించగలదని.. వాణిజ్యాన్ని వేగంగా మరియు చౌకగా చేయగలదని అధికారులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com