మొరాకో భూకంపం: 1,000 దాటిన మృతుల సంఖ్య
- September 10, 2023
యూఏఈ: మొరాకోలో సంభవించిన శక్తివంతమైన భూకంపంలో 1,000 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. మొరాకో ప్రభుత్వం మర్రాకెచ్ సమీపంలో సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 1,037కి చేరుకుందని, 1,200 మందికి పైగా గాయపడ్డారని వెల్లడించింది. మొరాకోలోని హై అట్లాస్ పర్వతాలలో శుక్రవారం అర్థరాత్రి 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అల్ హౌజ్, ఔర్జాజేట్, మర్రకేచ్, అజిలాల్, చిచౌవా, తారాడంట్ ప్రావిన్స్‌లలో భూకంపం సంభవించిందని టెలివిజన్ ప్రకటనలో అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. హై అట్లాస్‌లోని ఇఘిల్ ప్రాంతంలో రాత్రి 11 గంటల (2200 GMT) తర్వాత భూకంపం సంభవించిందని మొరాకో జియోఫిజికల్ సెంటర్ పేర్కొంది. US జియోలాజికల్ సర్వే ప్రకారం.. ప్రకంపనలు కనీసం 12,000 మంది చనిపోయి ఉంటారని, 1960 నుండి మొరాకోలో ఇది అత్యంత ఘోరమైనదని తెలిపింది. మొరకో ప్రభుత్వ ప్రపంచ దేశాలు సంఘీభావం తెలిపాయి. ఇప్పటికే సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన వారు మొరాకో చేరుకుంటున్నారు. అక్టోబరు ప్రారంభంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి మరియు ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాలకు మర్రకేచ్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది.
తాజా వార్తలు
- హాస్పిటల్లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర
- నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 10 వేల పరిహారం: సీఎం రేవంత్
- ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- శ్రీవారి సేవ పై టీటీడీ ఈఓ సమీక్ష
- ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్!
- వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
- భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!







