G20 సమ్మిట్: రెండోరోజు మొదలైన శిఖరాగ్ర సమావేశాలు..
- September 10, 2023
న్యూ ఢిల్లీ: రెండోరోజు జీ20 శిఖరాగ్ర సమావేశాలు మొదలయ్యాయి. కార్యక్రమంలో మొదటగా ఉదయం రాజ్ ఘాట్ వద్ద మహాత్మాగాంధీ స్మృతికి G20 దేశాధినేతలు నివాళులర్పించారు. ఈరోజు ఉదయం రాజ్‌ఘాట్‌లో మహాత్మ గాంధీకి ప్రపంచ నేతలు నివాళులర్పించారు. వారందరికి ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతం పలికారు. వారంతా రాజ్‌ఘాట్‌లో మహాత్మ గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్, కెనడా పీఎం జస్టిన్ ట్రూడో,ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ పీఎం ఫుమియో కిషిడా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌లతో పాటు పలువురు నేతలు రాజ్ ఘాట్ కు చేరుకున్నారు.
ఆ తరువాత ఇక ఈరోజు మధ్యాహ్నం మద్యాహ్నం 12:30 గంటల వరకు భారత మండపంలో ఒకే భవిష్యత్ అంశం పై చర్చలు జరగున్నాయి. ఇక జీ20 మొదటి రోజు సమావేశంలో జీవ ఇంధనంపై ప్రపంచ కూటమిని ప్రారంభిస్తున్నట్లు మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఢిల్లీ డిక్లరేషన్ ను కూడా కూటమి దేశాలు అంగీకరించాయి. ఒకే భవిష్యత్ అంశం చర్చ తరువాత నేడు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ తో ప్రధాని మోడీకి వర్కింగ్ లంచ్ ఉండనుంది. మరోవైపు జీ20 సదస్సులో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. వియత్నంకు బయలుదేరారు.
అనంతరం విడిగా కెనడా దేశాధినేతతో సమావేశం కానున్నారు ప్రధాని మోడీ. ఆ తర్వాత వరుసగా కొమొరోస్, తుర్కియే (టర్కీ), యూఏఈ, దక్షిణ కొరియా, యురోపియన్ యూనియన్, బ్రెజిల్, నైజీరియా అధినేతలతో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇక పలు కీలక అంశాలపై రంగాల వారీగా ఆయా దేశాలతో భారత్ పలు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. వచ్చే ఏడాదికి జీ1 అధ్యక్ష బాధ్యతను భారత్ బ్రెజిల్ కు అప్పగించనుంది. ఆఫ్రికన్ యూనియన్ కు నిన్న జరిగిన సమావేశంలో శాశ్వత సభ్యత్వం ప్రకటించడంతో జీ20 సదస్సు ఇకపై జీ21 సదస్సు కానుంది. మొదటి జీ21 సదస్సుకు బ్రెజిల్ వేదిక కానుంది.
తాజా వార్తలు
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్‌లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!
- ఒమన్ రోడ్లపై స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..!!
- ఎయిర్ ఏషియా బహ్రెయిన్‌లో మిడిల్ ఈస్ట్ హబ్ ప్రారంభం..!!
- వన్డే ప్రపంచకప్ విజయం.. భారత మహిళల క్రికెట్ టీమ్ పై బీసీసీఐ కోట్ల వర్షం..
- రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, కంకర లారీ ఢీ.. 19 మంది మృతి..
- షార్జాలో ప్రొటెక్ట్ యానిమల్స్ బిజినెస్..వ్యక్తి అరెస్టు..!!
- రెడ్ క్రెసెంట్ లోగో దుర్వినియోగం..ఏడాది జైలు, SR1 మిలియన్ ఫైన్..!!







