బైక్ ర్యాలీతో సరికొత్త రికార్డ్ సృష్టించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- September 16, 2023
హైదరాబాద్: కేంద్ర మంత్రి జి. కిషన్ సరికొత్త రికార్డు సృష్టించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో చైతన్యం నింపేందుకు.. స్వయంగా తానే 200 కిలోమీటర్లపాటు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. 7 గంటలపాటు జరిగిన ఈ ర్యాలీ సందర్భంగా కేంద్రమంత్రికి అడుగడుగునా జనం నీరాజనం పలికారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ నుంచి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఉదయం ర్యాలీ ప్రారంభమైంది.
ఈ ర్యాలీకి బీజేపీ కార్యకర్తలు, యువత తమ వాహనాలతో ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపారు. అడుగడుగునా మహిళలు, కార్యకర్తలు.. కిషన్ రెడ్డికి స్వాగతం పలికారు. హరతి పట్టి వీరతిలకం దిద్దారు. త్రివర్ణ పతాకాలు, బీజేపీ జెండాలతో ఈ ర్యాలీ పొడగునా రోడ్లన్నీ రంగులమయంగా మారాయి. బైక్ యాత్ర హబ్సిగూడ, ఉప్పల్, ఘట్ కేసర్, భువనగిరి, ఆలేరు మీదుగా జనగాం, వరంగల్, ములుగు క్రాస్ రోడ్ మీదుగా పరకాలలోలని అమరధామం వరకు ఈ యాత్ర కొనసాగింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్‌లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్‌లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్‌లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో అరుదైన ఘనత..!!
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు







