ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ కీలక సూచన
- September 18, 2023న్యూ ఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు ముందు పార్లమెంట్ ఎదుట ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. ఉజ్వల భవిష్యత్తు దిశగా భారత్ పయనిస్తోందని, కొత్త సంకల్పం దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేయాలని అన్నారు. ప్రస్తుతం ఐదు రోజులపాటు జరిగే ప్రత్యేక సమావేశాల్లో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా సరికొత్త ఉత్సాహం వెల్లివిరుస్తోందని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని మోదీ చెప్పారు.
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నిడివి తక్కువే అయినప్పటికీ.. సందర్భం చాలా గొప్పదని, ఈ సమావేశాల్లో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నామని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ప్రధానిమోదీ ప్రతిపక్షాలకు ఓ విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రతిపక్ష సభ్యులు సహకరిస్తారని భావిస్తున్నానని, ఏడుపులు, విమర్శలకు ఇది సమయం కాదని గుర్తుంచుకోవాలని కోరారు. విశ్వాసం, సానుకూల దృక్పథంతో ఈ సమావేశాలు నిర్వహించుకుందామని, సభ్యులంతా ఉత్సాహంగా చర్చల్లో పాల్గొంటారని ఆశిస్తున్నట్లు మోదీ అన్నారు.
జీ20 సదస్సు సక్సెస్ భారత దేశానికి గర్వకారణం అని ప్రధాని మోదీ అన్నారు. భారత్ సత్తా ఏంటో చూపించామని, జీ20 విజయాన్ని ప్రపంచాధినేతలు ప్రశంసించారని మోదీ అన్నారు. ఆఫ్రికన్ యూనియన్ జీ20 శాశ్వత సభ్యత్వం పొందినందుకు భారత్ గర్వపడుతుందని, ఇవన్నీ భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు సంకేతం అని మోదీ అన్నారు. చంద్రయాన్-3 విజయవంతో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని, మన జెండా సగర్వంగా రెపరెపలాడుతుందని మోదీ అన్నారు.
తాజా వార్తలు
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి
- రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం
- తిరుమల తిరుపతి శ్రీవారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు
- ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వైరం ఏమిటి? ఎందుకు?
- ఇండియాకు పన్నెండు ఐఫోన్ 16 తీసుకొస్తూ.. పట్టుబడ్డ ప్రయాణికులు..!!
- అబుదాబిలో వేటాడుతూ.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వేటగాళ్లు..!!
- సౌదీ అరేబియాలో ఇన్‌బౌండ్ విజిటర్స్ వ్యయంలో 8.2% వృద్ధి..!!
- GCC-IMF సమావేశం.. ‘ఎకనామిక్స్ ఛాలెంజెస్’పై కీలక సమీక్ష..
- ఎక్స్పో సిటీ దుబాయ్.. మాస్టర్ ప్లాన్‌కు షేక్ మహమ్మద్ ఆమోదం..!!