టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- March 07, 2026
రియాద్: షైబా చమురు క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ 16 డ్రోన్లను అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. షైబా క్షేత్రం వైపు వెళుతుండగా నాలుగు డ్రోన్లను అడ్డగించి ధ్వంసం చేసినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కి అల్-మాలికి తెలిపారు. అనంతరం క్షేత్రంపై జరిగిన మరో దాడి ప్రయత్నంలో మరో ఆరు డ్రోన్లను అడ్డగించి ధ్వంస చేశామని ఆయన చెప్పారు.
ఆ తరువాత షైబా దిశగా వెళ్తున్న మరో నాలుగు డ్రోన్లను ధ్వంసం చేశామని, ఆ తర్వాత మరో రెండు డ్రోన్లను కూడా అడ్డుకున్నట్లు ఆయన ప్రకటించారు.
ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం వైపు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని సౌదీ వైమానిక రక్షణ దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయని అల్-మాలికి చెప్పారు. మరో సంఘటనలో రియాద్ తూర్పున ఒక డ్రోన్‌ను అడ్డుకున్నట్లు తెలిపారు.
ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య సౌదీ అరేబియా డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా పనిచేస్తుందని, ఇరాన్ దాడులను ఎదుర్కొని వాటిని గాలిలోనే ధ్వంసం చేస్తున్నామని అన్నారు. ప్రజలు, నివాసితులు ఎలాంటి పుకార్లను నమ్మొద్దని కోరారు. ఫేక్ వార్తలు, కంటెంట్ ను షేర్ చేయొద్దని అల్-మాలికి సూచించారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







