షార్జా పోలీసుల 'బీ అవేర్' క్యాంపెయిన్
- September 20, 2023
షార్జా: “బీ అవేర్” అవగాహన ప్రచార కార్యక్రమాలను షార్జా పోలీస్ జనరల్ కమాండ్ (SPGC) కొనసాగిస్తోంది. "ఫాక్స్ సినిమా" సహకారంతో "సినిమా స్క్రీన్ల" ద్వారా కమ్యూనిటీ సభ్యులకు అవగాహన కల్పిస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గేమ్‌లు ఆడటం వల్ల కలిగే నష్టాలతో పాటు మోసపోయే విధానాలు, ఎలక్ట్రానిక్ బ్లాక్మెయిల్ నేరాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. అదే సమయంలో ఎలక్ట్రానిక్ గేమ్‌లను ఆడటం ద్వారా కలిగే నష్టాల గురించి పిల్లలకు అవగాహన కల్పించే షార్ట్ ఫిల్మ్ లను కూడా ప్రదర్శిస్తున్నట్లు మీడియా, పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ ముహమ్మద్ బుట్టి అల్ హజ్రీ తెలిపారు.
ట్రోల్లు, మోసగాళ్ల బెదిరింపులు లేదా బ్లాక్మెయిల్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని కమ్యూనిటీ సభ్యులకు షార్జా పోలీసులు పిలుపునిచ్చారు. “0559992158” లేదా “065943228” నంబర్లకు కాల్ చేయడం ద్వారా లేదా అత్యవసర కేసుల కోసం నియమించబడిన నంబర్ 999కి కాల్ చేయడం ద్వారా లేదా షార్జా పోలీస్ వెబ్సైట్ http://www.shjpolice.gov.ae ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు.
తాజా వార్తలు
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన







