‘లవ్ స్టోరీ’ కాంబో మళ్లీ రిపీట్.!

- September 20, 2023 , by Maagulf
‘లవ్ స్టోరీ’ కాంబో మళ్లీ రిపీట్.!

అక్కినేని నాగచైతన్య తన 23వ చిత్రాన్ని తాజాగా ప్రకటించారు. ‘సవ్య సాచి’ సినిమా తెరకెక్కించిన చందూ మొండేటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. 

ఇటీవలే ‘లవ్ స్టోరీ’ సినిమాతో ఈ కాంబో మంచి క్రేజ్ దక్కించుకుంది. అటు సాయి పల్లవికి, ఇటు నాగ చైతన్యకీ మంచి పేరొచ్చింది. మంచి వసూళ్లు రాబట్టి, బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. 

ఇదే కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవ్వబోతోందంటే పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే, ఏ కాన్సెప్ట్‌తో ఈ సినిమా వుండబోతోంది.? ఎలాంటి సంచలనాలు రిపీట్ చేయబోతోంది.? అనేది తెలియాలంటే ఇంకాస్త టైమ్ వెయిట్ చేయాల్సిందే.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది ఈ చిత్రం. త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com