నిర్మాతగా మారనున్న నటి మీనా
- May 20, 2016
తొంబైలలో స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేసిన సీనియర్ హీరోయిన్ మీనా, త్వరలో మరో పాత్రకు రెడీ అవుతోంది. ఇటీవల దృశ్యం సినిమాతో మరోసారి నటిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న మీనా, ఇపుడు నిర్మాతగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోంది. ఇప్పటికే తన ప్రొడక్షన్ హౌస్ కు సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టిన ఈ భామ టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో టాప్ స్టార్లతో సినిమాలు నిర్మించాలని భావిస్తోంది. తన నిర్మాణసంస్థలో మహేష్ బాబు, కమల్ హాసన్ లాంటి హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించాలని ప్లాన్ చేస్తోంది.అయితే ఈ ఇద్దరు హీరోలు ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. బ్రహ్మోత్సవం రిలీజ్ తరువాత మురుగదాస్ దర్శకత్వంలో బైలింగ్యువల్ సినిమాకు రెడీ అవుతున్నాడు మహేష్. ఆ తరువాత కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాలు లైన్ లో ఉన్నాయి. కమల్ కూడా శభాష్ నాయుడు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత కూడా మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. మరి మీనా ఈ ప్రాజెక్ట్ లు పూర్తయ్యేవరకు మీనా వెయిట్ చేస్తుందో లేక వేరే హీరోలతో నిర్మాణం మొదలెడుతుందో చూడాలి.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







