బిగ్‌బాస్‌లో ఏం జరుగుతోందంటే.!
- September 22, 2023
ఈ సారి ‘ఉల్టా ఫుల్టా’ అనే కాన్సెప్ట్‌తో బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. గత సీజన్లతో పోల్చితే ఈ సీజన్ కాస్త ఇంట్రెస్టింగ్‌గానే సాగుతోంది. హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు ఎవ్వరూ కన్ఫామ్ కంటెస్టెంట్లు కారంటూ బిగ్‌బాస్ చెప్పాడు.
వారి వారి టాస్క్ పర్ఫామెన్సెస్ ద్వారా ఇప్పుడిప్పుడే హౌస్‌లో శాశ్వత స్థానాన్ని దక్కించుకుంటున్నారు. అలా మొదటి కంటెస్టెంట్‌గా ఆట సందీప్, రెండో కంటెస్టెంట్‌గా నటుడు శివాజీ కన్పామ్ అయ్యారు. ఇక మూడో కంటెస్టెంట్ కోసం పోటీ నడుస్తోంది.
కంటెండర్లుగా శోభా రెడ్డి, యావర్, ప్రియాంక జైన్ ఎన్నుకోబడ్డారు. వీరిలోంచి ఎవరు మూడో కంటెస్టెంట్‌గా గెలుస్తారో చూడాలి మరి.
ఇదిలా వుంటే, తొలి కంటెస్టెంట్ అయిన సందీప్‌ని అన్ని టాస్కులకీ సంచాలకునిగా నియమిస్తున్నాడు బిగ్‌బాస్. సంచాలకుడు అంటే ఎలాంటి పార్షియాలిటీ చూపించకూడదు. కానీ, తనదైన పార్షియాలిటీతో లేటెస్ట్ ఎపిసోడ్లో సందీప్, మరో కంటెండర్ కావాల్సిన గౌతమ్ కృష్ణకి ఆ అవకాశాన్ని రానీయకుండా చేశాడు. ఆ స్థానంలోనే శోభా శెట్టి కన్ఫామ్ అయ్యింది.
అంతకు ముందు జరిగిన యావర్ టాస్క్‌లోనూ సందీప్ అదే ప్రయత్నం చేయబోగా.. సెకండ్ సంచాలకుడిగా వ్యవహరించిన శివాజీ అడ్డుపడడంతో ప్రిన్స్ యావర్ సేఫ్ అయ్యాడు. పాపం గౌతమ్ మాత్రం బలైపోయాడు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







