శ్రీలీలకు లక్కు రివర్స్ గేర్ వేస్తోందా.?
- September 22, 2023
టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత శ్రీలీలకు బాగా యూజ్ అయ్యిందనే చెప్పొచ్చేమో. అయితే, ఆ యూజ్ మరీ ఎక్కువైపోవడంతో ఇప్పుడు అదే పెద్ద తలనొప్పిగా మారింది శ్రీలీలకి.
వరుస పెట్టి ఛాన్సలు ఓకే చేసుకుంది శ్రీలీల. కానీ, అవన్నీ కంప్లీట్ చేయడం కత్తి మీద సామే అవుతోందట. ఇదిలా వుంటే, లేటెస్టుగా ఓ రెండు బిగ్ ఆఫర్లు శ్రీలీల వదిలేసుకోవాల్సి వచ్చిందట.
ఆ ఛాన్సులు రెండూ ఒకటి రష్మిక మండన్నాకీ, ఇంకోటి కృతి శెట్టికీ వెళ్లిపోయాయని అంటున్నారు. వాస్తవానికి వాటిని శ్రీలీలే దక్కించుకోవాలట. రష్మిక మండన్నా తెలుగులో అంత యాక్టివ్‌గా లేకపోవడం.. కృతి శెట్టికి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు రావడంతో ఆ ప్రాజెక్టులు హోల్డ్‌లో పడ్డాయట.
కానీ, శ్రీలీల దృష్టిలోనే ఆ ప్రాజెక్టులున్నాయని ప్రచారం జరిగింది. కానీ, ప్రస్తుతం శ్రీలీల వున్న పరిస్థితుల్లో మళ్లీ ఆ ప్రాజెక్టులు రష్మికను, కృతి శెట్టినీ వరించాయని అంటున్నారు.
ఇంత హెడ్‌ఏక్ భరించడం శ్రీలీలకీ కష్టమే మరి. చేసినవి కొన్ని ప్రాజెక్టులే అయినా శభాష్ అనిపించుకునేలా వుండాలి. మరీ ఒత్తిడికి లోనైనా కష్టమే.. అన్నింటికీ మించి వాటిలో ఏ ఒక్క ప్రాజెక్ట్ రిజల్ట్ బెడిసి కొట్టినా జరిగే పరిణామాల్ని శ్రీలీల వంటి నటీ మణులు తట్టుకోవడం ఇంకా కాష్టమే.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







