సాయి పల్లవికి ఇప్పుడు తెలిసొచ్చింది.!

- September 22, 2023 , by Maagulf
సాయి పల్లవికి ఇప్పుడు తెలిసొచ్చింది.!

హీరోయిన్లయందు సాయి పల్లవి వేరయా.! అంటే అతిశయోక్తి కాదేమో. అవును.. ఆమె హీరోయిన్‌లా అనిపించదు. పక్కింటమ్మాయ్.. కాదు కాదు, మన ఇంట్లోనూ ఇలాంటమ్మాయ్ వుంటే ఎంత బాగుంటుంది.. అనేలా వుంటుంది. 
అదే తక్కువ సినిమాలతోనైనా ఆమెను తెలుగు ప్రేక్షకులకు చాలా చాలా దగ్గర చేసేసింది. యూత్‌కే కాదు.. అన్ని వర్గాల ప్రేక్షకులకూ సాయి పల్లవి అంటే ప్రత్యేకమైన అభిమానం వుంది.
అందుకే ఆమెను ముద్దుగా లేడీ పవర్ స్టార్ అంటుంటారు. గత కొన్ని రోజులుగా సాయి పల్లవి కొత్తగా ఏ సినిమాకీ సైన్ చేసింది లేదు. ‘భోళా శంకర్’ ఛాన్స్ మిస్ చేసుకుందన్న విమర్శలు ఎదుర్కొన్నాకా కొంతకాలం సాయి పల్లవి కూడా ఫీలయ్యిందట.
ఆ సినిమా ఎలాగూ ఫ్లాప్ అవ్వడం.. తాజాగా నాగ చైతన్య సినిమాలో అవకాశం రావడంతో సాయి పల్లవి ఆనందానికి అవధుల్లేవ్. ‘లవ్‌స్టోరీ’ సినిమాతో ఈ పెయిర్‌కి హిట్ పెయిర్ అని పేరుంది. కాంబినేషన్‌తో పాటూ, నిర్మాణ సంస్థ కూడా బడానే. చందూ మొండేటి దర్శకత్వం.. సాయి పల్లవిని తీసుకున్నారంటే ఖచ్చితంగా కథలో విషయం వుండే వుంటుంది.
ఇలా అన్ని అవకాశాలు కలిసొచ్చాయ్. మళ్లీ సాయి పల్లవి తెలుగులో యాక్టివ్ అవ్వడానికి ఇదే ఛాన్స్ అనుకోవచ్చేమో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com