ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023.. ప్రైజ్ మనీ వెల్లడి

- September 23, 2023 , by Maagulf
ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023.. ప్రైజ్ మనీ వెల్లడి

మస్కట్: ఐసిసి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 నవంబర్ 19 న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభం కానుంది. టోర్నీకి సంబంధించి ప్రైజ్ మనీని ఐసీసీ వెల్లడించింది. విజేతకు ట్రోఫీతో పాటు టోర్నమెంట్‌లో మొత్తంగా US $ 4 మిలియన్లు దక్కుతాయి. రన్నర్స్-అప్ US$2 మిలియన్లను అందుకుంటారు.  అయితే ఓడిన సెమీ-ఫైనలిస్టులు మొత్తం US$10 మిలియన్ల ప్రైజ్ పాట్ నుండి ఒక్కొక్కరికి $800,000 అందుకుంటారు. 48 మ్యాచ్‌ల ఈ బిగ్ ఈవెంట్ అక్టోబర్ 5 నుంచి 10 వేదికల్లో జరగనుంది. క్రికెట్ ప్రపంచ కప్‌లో గెలిచిన ప్రతి లీగ్ మ్యాచ్‌కు ప్రైజ్ మనీ లభిస్తుంది. రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. గ్రూప్ స్థాయిలో విజేతగా నిలచే మొదటి నాలుగు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి. గ్రూప్ దశలో ప్రతి మ్యాచ్‌లో విజేత జట్టు US$40,000 అందుకుంటుంది.  సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించని ఆరు జట్లు US$100,000 చొప్పున ప్రైజ్ మనీ కింద అందుకుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com