అక్టోబర్ 17న ముంబై ఎయిర్ పోర్ట్ రన్‌వేలు మూసివేత

- September 23, 2023 , by Maagulf
అక్టోబర్ 17న ముంబై ఎయిర్ పోర్ట్ రన్‌వేలు మూసివేత

న్యూఢిల్లీ: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం తన రెండు రన్‌వేలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం దాని రన్‌వేలు - RWY 09/27 మరియు RWY 14/32 రెండింటిని తాత్కాలికంగా మూసివేయనున్నట్లు తెలిపింది. ఈ మూసివేత ఆంక్షలు అక్టోబర్17న స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అమల్లో ఉంటాయని ప్రకటించింది.  మరమ్మత్తు మరియు నిర్వహణ కార్యకలాపాలను చేపట్టడానికి మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో ఎయిర్ పోర్ట్ వర్గాలు వెల్లడించాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com