పబ్లిక్ పార్కింగ్ ప్రాజెక్ట్ కోసం 3,300 సెన్సార్ల ఇన్స్టాల్
- September 23, 2023
దోహా: పబ్లిక్ పార్కింగ్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్‌ను అమలు చేయడానికి, వెస్ట్ బే, కార్నిచ్ మరియు సెంట్రల్ దోహాలో సుమారు 3,300 వాహనాల పార్కింగ్ సెన్సార్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ 18,000 వాహనాలకు పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. అవసరమైన విధానాలను పూర్తి చేసిన వెంటనే ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. స్మార్ట్ ఖతార్ ప్రోగ్రామ్ (TASMU) ప్రాజెక్ట్‌లోని స్మార్ట్ పార్కింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పార్కింగ్‌ను రిజర్వ్ చేయడం, దానికి ఛార్జీలు వసూలు చేయడం, ఉల్లంఘనలను నియంత్రించడం, ఇందులోని చట్టం మరియు మంత్రివర్గ నిర్ణయాలను అనుసరించి జరిమానాలు విధించడం వంటి అన్ని అంశాలను పరిష్కరిస్తున్నట్లు నిర్ధారించడానికి పని జరుగుతోందన్నారు. మునిసిపాలిటీ ప్రధాన కార్యాలయంలో నిన్న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాహనాల పార్కింగ్‌ను నియంత్రించే ప్రాజెక్ట్ పూర్తి దశలను అధికారులు ప్రకటించారు. మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖలోని టెక్నికల్ ఆఫీస్ డైరెక్టర్ ఇంజి తారిఖ్ అల్ తమీమి మాట్లాడుతూ.. మొదటి దశలో 3,300 పార్కింగ్ సెన్సార్లు పూర్తయ్యాయని( 100%) పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన దశలను పూర్తి చేసేందుకు అన్ని ప్రాధాన్య ప్రాంతాలలో పనులు జరుగుతున్నాయన్నారు. దేశంలో వాహనాల పార్కింగ్ నిర్వహణ అనేక సానుకూల సూచికలను సాధించడంతోపాటు నగరాలు, నివాస పరిసరాల్లో జీవన నాణ్యతను మెరుగుపరచడంలో దోహదపడుతుందని అల్ తమీమి వివరించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







