గ్లోబల్ విలేజ్ బుకింగ్ తేదీలు, ప్రత్యేకమైన డీల్స్
- September 23, 2023
దుబాయ్: యూఏఈ నివాసితులు ఇప్పుడు తమ VIP ప్యాక్‌లను గ్లోబల్ విలేజ్ 28వ సీజన్ కోసం సెప్టెంబర్ 23 ఉదయం 10 గంటలకు ప్రీబుక్ చేసుకోవచ్చు. రిజర్వేషన్ కోసం పరిమిత సంఖ్యలో ప్యాక్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. అలాగే ఈ సీజన్ ప్యాక్‌ని కొనుగోలు చేసిన వారిలో ఒకరికి మెగా బహుమతిని గెలుచుకునే అవకాశం ఉంది. విజేతకు Dh28,000 విలువైన చెక్ అందుకుంటారు. VIP ప్యాక్‌ల అధికారిక విక్రయం సెప్టెంబర్ 30న ప్రారంభమవుతుంది. వర్జిన్ మెగాస్టోర్ టిక్కెట్‌ల వెబ్‌సైట్ ద్వారా రిజర్వేషన్‌లు చేసుకోవచ్చు. అతిథులు డైమండ్, ప్లాటినం, గోల్డ్ లేదా సిల్వర్ VIP ప్యాక్‌లను కొనుగోలు చేసుకోవచ్చు. అన్ని ప్యాక్‌లలో రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఈవెంట్, సైబర్ సిటీ స్టంట్ షో, కార్నావాల్‌తో సహా బహుళ గ్లోబల్ విలేజ్ లోని అన్ని ప్రాంతాలలో ఎంట్రీని.. VIP ప్రవేశ టిక్కెట్‌లు ఉన్నవారికి పార్కింగ్ సదుపాయాలు, వండర్ పాస్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ సీజన్‌లో కేవలం 30 డైమండ్ VIP ప్యాక్‌లు మాత్రమే Dh7000కి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. ప్లాటినం ప్యాక్‌లను Dh2950కి కొనుగోలు చేయవచ్చు, గోల్డ్ ప్యాక్ ధర Dh2250, సిల్వర్ ప్యాక్‌ల ధర Dh1750 లకే కొనుగోలు చేయవచ్చు. చెల్లుబాటు అయ్యే ఎమిరేట్స్ IDని కలిగి ఉండి.. 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు VIP ప్యాక్‌లను కొనుగోలు చేయడానికి అర్హులు. గ్లోబల్ విలేజ్ అక్టోబరు 18న ఓపెన్ అవుతుంది.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్‌డి స్మార్ట్ సిటీ ఇండెక్స్‌లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









