ఖలిస్థాన్ ఉగ్రవాదుల విషయమై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ
- September 25, 2023
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఖలిస్థాన్ ఉగ్రవాదుల విషయమై కీలక ఆదేశాలు జారీ చేసింది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలో ఉన్న ఖలిస్థాన్ ఉగ్రవాదులను గుర్తించి, వారి పేరిట ఉన్న ఓసీఐ కార్డులను (ఓవర్ సీస్ సిటిజన్ షిప్ ఆఫ్ ఇండియా) రద్దు చేయాలని దర్యాప్తు సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. తద్వారా వారు తిరిగి భారత్ కు రాకుండా చెక్ పెట్టాలని కోరింది. విదేశాల్లో స్థిరపడిన ఖలిస్థాన్ ఉగ్రవాదుల ఆస్తులను గుర్తించాలని దర్యాప్తు ఏజెన్సీలను కేంద్రం కోరినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం.
ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 19 మంది ఖలిస్థాన్ ఉగ్రవాదుల ప్రాపర్టీలను జప్తు చేయడం గమనార్హం. బ్రిటన్, అమెకరికా, కెనడా, యూఏఈ, పాకిస్థాన్ తదితర దేశాల్లో తలదాచుకుని, భారత్ వ్యతిరేక, ప్రత్యేక ఖలిస్థాన్ అనుకూల చర్యలకు పాల్పడుతున్న వారి జాబితాను ఎన్ఐఏ విడుదల చేసింది. కెనడాలో ఈ ఏడాది జూన్ లో ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడూ పార్లమెంటులో ఆరోపించడం తెలిసిందే. తదనంతర పరిణామాల్లో భారత్ వరుసగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది.
ఇప్పటికే కెనడా రాయబారిని భారత్ నుంచి వెలివేసింది. కెనడా పౌరులకు వీసాల జారీని నిలిపివేసింది. కెనడాలో నివసించే భారతీయులు తమ రక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఇప్పుడు ఓసీఐ కార్డుల రద్దుతో ఖలిస్థాన్ ఉగ్రవాదుల విషయంలో ఇక ఉపేక్షించేది లేదనే సంకేతాన్ని, వారికి షెల్టర్ కల్పిస్తున్న దేశాలకు ఇచ్చినట్టయింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







