ఈ నెలాఖరుతో ముగియనున్న 2 వేల నోట్ల మార్పిడి గడువు
- September 25, 2023
న్యూఢిల్లీ: ఈ నెలాఖరుతో రూ.2 వేల నోటు మార్పిడికి గడువు ముగిసిపోతుంది. ఇప్పటికీ మీవద్ద పెద్ద నోట్లు ఉంటే వెంటనే బ్యాంకులో డిపాజిట్ చేసుకోండని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. పెద్ద నోటు మార్చుకునేందుకు ఆర్బీఐ గడువును పెంచే సూచనలు కనిపించడంలేదని చెబుతున్నారు. మే 19న రూ.2 వేల నోటు చలామణిని నిలిపివేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ప్రజలు తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను బ్యాంకులలో మార్చుకోవాలని సూచించింది. ఇందుకు సెప్టెంబర్ 30 వ తేదీని గడువుగా నిర్ణయించింది. అప్పటి వరకు పెద్ద నోటు మార్కెట్లో చలామణిలో ఉంటుందని, ఆ తర్వాత చెల్లబోదని స్పష్టం చేసింది.
ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. ఇప్పటి వరకు మార్కెట్ లోని రూ.2 వేల నోట్లలో 97 శాతం బ్యాంకులకు తిరిగొచ్చాయి. పెద్ద నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటన చేసిన 20 రోజుల్లోనే 50 శాతం నోట్లు తిరిగొచ్చాయని చెప్పింది. మార్కెట్లో ఇప్పటికీ ఉన్న మరో 7 శాతం నోట్లు ఇంకా రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద నోట్లు ఉన్న వారు తమ దగ్గర్లోని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడమో లేక చిన్న నోట్లతో మార్చుకోవడమో చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









