గృహ కార్మికులుగా కువైట్ వస్తున్నారా.. ఇండియన్ ఎంబసీ కీలక సూచనలు

- September 25, 2023 , by Maagulf
గృహ కార్మికులుగా కువైట్ వస్తున్నారా.. ఇండియన్ ఎంబసీ కీలక సూచనలు

కువైట్: డొమెస్టిక్ వర్కర్(DW) వీసాపై కువైట్‌లో ఉన్న భారతీయ పౌరుల కోసం కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది. కువైట్‌లోని డొమెస్టిక్ వర్కర్ చట్టాలు (లా నం. 68 ఆఫ్ 2015), సంబంధిత మంత్రిత్వ నిర్ణయాలు మరియు కార్యనిర్వాహక నిబంధనల ప్రకారం ఒక భారతీయ జాతీయుడు గృహ కార్మికునిగా కువైట్‌కు రావడానికి అవసరమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.

రాతపూర్వక ఉపాధి ఒప్పందం (అరబిక్ , ఆంగ్లంలో), తప్పనిసరి.

అంతర్గత మంత్రిత్వ శాఖ పేర్కొన్న కనీస వేతనం కంటే తక్కువ ఉండకూడదు. (భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం, కువైట్‌లోని భారతీయ జాతీయ DWలకు సూచించిన కనీస వేతనాలు నెలకు KD 120.)

ఏ తగ్గింపు లేకుండా చేరిన తేదీ నుండి ప్రతి నెలాఖరులో అంగీకరించిన వేతనం చెల్లింపు జరగాలి. (అంగీకరించిన వేతనాలు చెల్లించని పక్షంలో, ఆలస్యమైన ప్రతి నెలకు KWD 10/- యజమాని చెల్లించాలి).

ఉచిత ఆహారం, దుస్తులు, వైద్య చికిత్స మరియు తగిన వసతి కల్పించడం తప్పనిసరి.

అదనపు పనికి పరిహారం (చెల్లించని పక్షంలో, PAM విచారణ జరిపి, అంగీకరించిన వేతనానికి రెట్టింపు చెల్లించమని యజమానిని ఆదేశించవచ్చు).

వారాంతపు విశ్రాంతితోపాటు వార్షిక సెలవులను ఇవ్వాలి.

సేవా ముగింపు ప్రయోజనాలుగా ప్రతి సంవత్సరానికి ఒక నెల వేతనం అదనంగా అందజేయాలి.

ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే లేదా మానవ గౌరవానికి భంగం కలిగించే ఎలాంటి ప్రమాదకర పనిని DWలకు కేటాయించవద్దు.

గరిష్ట పని గంటలు రోజుకు 12 గంటల కంటే ఎక్కువ ఉండకూడదు.

DWల పాస్‌పోర్ట్/సివిల్ ఐడిని DWల అనుమతి లేకుండా యజమాని ఉంచుకోవడానికి నిబంధనలు అంగీకరించవు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com