దుబాయ్ లో అగ్ని ప్రమాదం..తప్పిన పెనుముప్పు
- September 25, 2023
దుబాయ్: సోమవారం తెల్లవారుజామున దుబాయ్‌లోని ఒక రెసిడెన్షియల్ టవర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. తెల్లవారుజామున 4 గంటల తర్వాత జరిగిన అగ్ని ప్రమాదంలో అధికారులు సకాలంలో స్పందించడంతో ఎవరూ గాయపడలేదు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ ప్రకారం.. అల్ బార్షా స్టేషన్ నుండి అగ్నిమాపక సిబ్బంది ఆరు నిమిషాలలోపు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి ప్రజలను సురక్షితంగా ఖాళీ చేయించారు. మరో రెండు అగ్నిమాపక కేంద్రాల నుంచి ఎమర్జెన్సీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. తెల్లవారుజామున 5.23 గంటలకు మంటలు అదుపులోకి రాగా మరోగంట తర్వాత మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ప్రస్తుతం శీతలీకరణ చర్యలు కొనసాగుతున్నాయని, ఆ తర్వాత స్థలాన్ని సంబంధిత అధికారులకు అప్పగిస్తామని అగ్నిమాపక అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









