షేక్ మొహమ్మద్ బిన్ షేక్ మెజ్రెన్ బిన్ సుల్తాన్ మరణం పట్ల షేక్ మహమ్మద్ సంతాపం

- September 25, 2023 , by Maagulf
షేక్ మొహమ్మద్ బిన్ షేక్ మెజ్రెన్ బిన్ సుల్తాన్ మరణం పట్ల షేక్ మహమ్మద్ సంతాపం

యూఏఈ: ఆదివారం మరణించిన షేక్ మొహమ్మద్ బిన్ షేక్ మెజ్రెన్ బిన్ సుల్తాన్‌కు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నివాళులర్పించారు. ఈ మేరకు మైక్రోబ్లాగింగ్ సైట్ X (గతంలో ట్విట్టర్ )లో ఓ పోస్ట్ ను షేర్ చేశారు. దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ షేక్ మెజ్రెన్ మరణించినందుకు సంతాపం తెలిపారు. అతనిని 'విశ్వసనీయ సలహాదారు'గా గుర్తు చేసుకున్నారు. "ఈ రోజు, దుబాయ్ దాని విశిష్ట వ్యక్తులలో ఒకరైన షేక్ ముహమ్మద్ బిన్ షేక్ మెజ్రెన్ బిన్ సుల్తాన్‌కు వీడ్కోలు పలుకుతుంది. ఆయన నమ్మకమైన సలహాదారులు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి." అరి రాసుకొచ్చారు.  షేక్ మొహమ్మద్ బిన్ షేక్ మెజ్రెన్ బిన్ సుల్తాన్ దివంగత దుబాయ్ పాలకుడు షేక్ రషీద్ బిన్ సయీద్ సమకాలీనుడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com