థైరాయిడ్‌ని కంట్రోల్‌లో వుంచాలంటే.!

- September 25, 2023 , by Maagulf
థైరాయిడ్‌ని కంట్రోల్‌లో వుంచాలంటే.!

శరీరంలోని ముఖ్యమైన గ్రంధుల్లో ధైరాయిడ్ గ్రంధి ఒకటి. కానీ, నేటి జీవన శైలిలో చాలా మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. శరీర బరువును కంట్రోల్‌లో వుంచేందుకూ.. జీవక్రియలను నియంత్రణలో వుంచేందుకు ఊపిరితిత్తుల పని తీరును మెరుగ్గా వుంచడంలోనూ థైరాయిడ్ గ్రంధి అత్యంత కీలక పాత్ర వహిస్తుంది. 

మరి, ఈ గ్రంధిని ఆరోగ్యంగా కాపాడుకోవల్సిన బాధ్యత వుంది కదా.! అందుకోసం కొన్ని ఆహార నియమాలు ఖచ్చితంగా పాఠించాల్సిన ఆవశ్యకత వుంది. 

ధైరాయిడ్ సమస్య కారణంగా శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. తద్వారా గుండె జబ్బు ముప్పు అవకాశాలు ఎక్కువ. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలున్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి.

కంది పప్పు వంటి పప్పు ధాన్యాలతో పాటూ, చేపలు, గుడ్లు వంటి నాన్‌వెజ్ ఐటెమ్స్‌లో ఎక్కువగా ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలుంటాయ్. అలాగే ఆకుకూరల్లోనూ వీటి పర్సంటేజ్ ఎక్కువగానే వుంటుంది. 

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వుండే పదార్ధాలను తీసుకోవాలి. అలాగే, తృణ ధాన్యాలను కూడా ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, థైరాయిడ్‌తో బాధపడేవారు పెరుగును ప్రతీరోజూ క్రమం తప్పకుండా తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆయా ఆహార పదార్ధాలను డైట్‌లో చేర్చుకోవడం వల్ల థైరాయిడ్ సమస్య రాకుండా నివారించుకోవడంతో పాటూ, ఆల్రెడీ ఆ సమస్యతో బాధపడేవారికి కాస్త ఉపశమనం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com