శ్రీలీల లిస్టులో మరో క్రేజీ ప్రాజెక్ట్.!
- September 25, 2023
ఎంత చెప్పుకున్నా శ్రీలీల క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ శ్రీలీల లిస్టులో చేరిందంటూ ప్రచారం మొదలైంది. ఈ సారి యూనివర్సల్ స్టార్ ప్రబాస్ పేరును లిస్టులో చేర్చేశారు.
ప్రబాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కాల్సి వుంది. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీల పేరు చర్చకొచ్చిందట. ప్రస్తుతం శ్రీలీల సీనియర్ స్టార్స్‌లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ తదితర హీరోల సినిమాల్ల్లో నటిస్తోంది.
ఇక, ఇప్పుడు ప్రబాస్ సినిమాలో అంటే ఖచ్చితంగా అది ఆమెకు ప్రమోషనే అని చెప్పాలి. అయితే, ఈ ప్రచారంలో నిజమెంతో తెలీదు కానీ, త్వరలోనే పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
మరికొద్ది రోజుల్లోనే ‘స్కంధ’ సినిమాతో శ్రీలీల ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే, వచ్చే నెలలో ‘భగవంత్ కేసరి’ రిలీజ్ కానుంది. సంక్రాంతికి మహేష్ బాబు ‘గుంటూరు కారం’తో సందడి చేయనుంది.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఎలాగూ వుంది. వీటితో పాటూ, నితిన్ తదితర హీరోల సినిమాలు కూడా లిస్టులో వున్నాయ్.
తాజాగా ప్రబాస్ సినిమా.. వామ్మో.! శ్రీలీల ఇంకా ఇంకా బిజీ అయిపోతోందిగా.!
తాజా వార్తలు
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం