పచ్చి ఉల్లిపాయలు (స్ప్రింగ్ ఆనియన్) తింటున్నారా.?
- September 26, 2023ఉల్లిపాయలు లేకుండా ఏ కూర వండలేం. ప్రతీరోజూ ఉపయోగించే కూరల్లో ఉల్లిపాయలది అత్యంత కీలక స్థానం. అయితే, స్ప్రింగ్ ఆనియన్స్ అని పిలవబడే పచ్చి ఉల్లిపాయలును చాలా తక్కువగా మాత్రమే యూజ్ చేస్తుంటారు.
రెస్టారెంట్ ఫుడ్స్‌లో ఎక్కువగా చూస్తుంటాం. అలాగే, ప్రైడ్ రైస్.. సలాడ్స్ వంటి వాటిలోనూ వీటిని విరివిగా వాడుతుంటారు. కానీ, ఇంటి వంటకాల్లో ఎంతమంది వీటిని యూజ్ చేస్తున్నారు.?
చాలా తక్కువ మంది అన్న సమాధానమే వస్తుంది. కానీ, ఇంటి వంటకాల్లోనూ రెగ్యులర్‌గా వీటిని యూజ్ చేయాల్సిన అవసరం వుందని నిపుణులు చెబుతున్నారు. అందుకు కారణం ఈ స్ప్రింగ్ ఆనియన్స్‌లో వున్న పోషకాలే.
అవి ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేస్తాయట. ధమనుల పని తీరును మెరుగు పరచడంలో స్ర్పింగ్ ఆనియన్స్ కీలక పాత్ర పోషిస్తాయట. తద్వారా రక్త పోటు రాకుండా వుంటుంది. గుండె పొరల్లో బ్లాకులు ఏర్పడకుండా వుంటాయ్. సో, స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువగా తినే వారిలో గుండె పోటు ముప్పు చాలా తక్కువట.
అలాగే, ఫైబర్ అధికంగా వుండే ఫుడ్ ఐటెమ్స్‌లో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఒకటి. ఇవి ఆకుకూరల జాబితాలోకీ వస్తాయ్. అందుకే వీటిని విరివిగా వాడమని వైద్యులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు