‘సలార్’ వచ్చేదప్పుడేనా.? ఈసారైనా నమ్మెచ్చా.?
- September 26, 2023
‘ఆది పురుష్’ సినిమాతో ప్రబాస్‌పై దారుణమైన నెగిటివిటీ వచ్చేసింది. ఆ నెగిటివిటీ అంతా తదుపరి రాబోయే ‘సలార్’తో పోగొట్టుకోవాలని ప్రబాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇదిగో అదిగో అంటున్న ‘సలార్’ అంతకంతకూ ఆలస్యమవుతూ వస్తోంది. సెప్టెంబర్‌లో రిలీజ్ కావల్సి వుండగా.. సీజీ వర్క్ పెండింగ్ అనీ, రీ షూట్స్ అనీ.. ఏవేవో ప్రచారాల నడుమ వాయిదా పడింది.
ఇప్పుడు తాజాగా మరో రిలీజ్ ప్రచారం తెరపైకి వచ్చింది. డిశంబర్ 22న ‘సలార్’ ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ కాబోతోందన్నదే ఆ ప్రచారం తాలూకు సారాంశం.
అయితే, ఈ సారైనా ‘సలార్’ రిలీజ్ అవుతుందా.? ఏమో డౌటే. ‘కేజీఎఫ్’ సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమే ‘సలార్’.
శృతి హాసన్ ఈ సినిమాలో ప్రబాస్‌కి జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ రేంజ్ మేకింగ్ స్టైల్ ఈ సినిమాలో చూపించబోతున్నాడు ప్రశాంత్ నీల్.. అని ప్రచారం జరుగుతోంది.
ప్రబాస్ సినిమాలపై ‘బాహుబలి’ తర్వాత ఆటోమెటిగ్గా ఈ తరహా ప్రచారాలు సర్వసాధారణమైపోయాయ్. కానీ, ఆ అంచనాల్ని ఆయా సినిమాలు అందుకోలేకపోవడమే చిత్రమ్.! మరి, ‘సలార్’ ఏం చేస్తాడో చూడాలిక.!
తాజా వార్తలు
- మస్కట్లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!