2030 ఇస్లామిక్ వరల్డ్స్ క్యాపిటల్ ఆఫ్ కల్చర్‌గా ‘లుసైల్’ ఎంపిక

- September 27, 2023 , by Maagulf
2030 ఇస్లామిక్ వరల్డ్స్ క్యాపిటల్ ఆఫ్ కల్చర్‌గా ‘లుసైల్’ ఎంపిక

దోహా: ఖతార్ లోని లుసైల్ నగరం అధికారికంగా 2030 సంవత్సరానికి ఇస్లామిక్ వరల్డ్స్ క్యాపిటల్ ఆఫ్ కల్చర్‌గా ఎంపికైంది. ఇస్లామిక్ వరల్డ్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్ (ISESCO)నిర్వహించిన ఇస్లామిక్ ప్రపంచంలోని సాంస్కృతిక మంత్రుల 12వ సమావేశంలో ఈ నగరాన్ని ఎంపిక చేశారు.  అలాగే 2024లో రిపబ్లిక్ ఆఫ్ అజర్‌బైజాన్‌లో షుషా, 2025లో రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్‌లోని సమర్ ఖండ్, 2026లో పాలస్తీనాలోని హెబ్రాన్‌, 2026లో రిపబ్లిక్ ఆఫ్ కోట్ డి ఐవోర్‌లో అబిడ్జన్,  2027లో అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్‌లో సివా నగరాలు ఎంపికయ్యాయి. లుసైల్ నగరం ఒక చారిత్రాత్మక సాంస్కృతిక నగరంగా గుర్తింపు పొందింది. ఖతార్ వారసత్వం, సాంస్కృతిక విలువలకు ప్రతీకగా నిలిచింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com