GCC నివాసితులకు త్వరలో ఒకే వీసా

- September 27, 2023 , by Maagulf
GCC నివాసితులకు త్వరలో ఒకే వీసా

యూఏఈ: ఆరు దేశాల గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) తమ నివాసితులు సభ్య దేశాల మధ్య స్వేచ్ఛగా ప్రయాణించేలా ఒకే వీసా విధానాన్ని పరిశీలిస్తోందని యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ టౌక్ అల్ మర్రీ తెలిపారు. ఈ మేరకు బ్లూమ్‌బెర్గ్ ప్రకటించింది. అతి త్వరలో ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం GCC దేశాల పౌరులు మాత్రమే యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్‌లకు వీసా రహిత ప్రయాణాన్ని ఆనందిస్తున్నారు. ఈ దేశాల్లో నివసిస్తున్న ప్రవాసులు ప్రతి సభ్య దేశానికి ప్రయాణించడానికి వీసా కోసం దరఖాస్తు చేయాలి. కొన్ని జాతీయులకు వీసా-రహిత లేదా వీసా-ఆన్-అరైవల్ సదుపాయం అందుబాటులో ఉంది. మంగళవారం అబుధాబిలో జరిగిన ఫ్యూచర్ హాస్పిటాలిటీ సమ్మిట్‌లో అల్ మర్రి పాన్-జిసిసి సింగిల్ వీసాపై మాట్లాడారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com