ఇరాక్ లో పెళ్లి మండపంలో అగ్ని ప్రమాదం..100 మందికి పైగా మృతి
- September 27, 2023
బాగ్దాద్: ఉత్తర ఇరాక్‌లో క్రైస్తవ వివాహానికి ఆతిథ్యం ఇస్తున్న హాలులో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 100 మంది మరణించారు. 150 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇరాక్‌లోని నినెవే ప్రావిన్స్‌లోని హమ్దానియా ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. అది రాజధాని బాగ్దాద్‌కు వాయువ్యంగా 335 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోసుల్ నగరానికి వెలుపల క్రైస్తవులు ఎక్కువగా ఉండే ప్రాంతం. ప్రమాదం నుంచి బయటపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి సైఫ్ అల్-బదర్ తెలిపారు. ప్రధాన మంత్రి మహ్మద్ షియా అల్-సుదానీ అగ్నిప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్‌లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







