ఖతార్‌ మరియు సైత్‌ ఆఫ్రికా మధ్య ఒప్పందం

- May 20, 2016 , by Maagulf
ఖతార్‌ మరియు సైత్‌ ఆఫ్రికా మధ్య ఒప్పందం

ఎమిర్‌ షేక్‌ తమీమ్‌ బిన్‌ హమాద్‌ అల్‌ థని, సౌతాఫ్రికా ప్రెసిడెంట్‌ జాకోబ్‌ జుమా ఎమిరి దివాన్‌లో సమావేశమయ్యారు. ఇరు దేశాల ప్రముఖులూ, ఇరు దేశాల మధ్య సహాయ సహకారాలకు సంబంధించి పలు ఒప్పందాలపై సంతకం చేశారు. డిఫెన్స్‌, పోలీస్‌ సహా పలు రంగాల్లో పరస్పర సహకారం ఈ ఒప్పందాల లక్ష్యం. వివిధ రంగాల్లో సన్నిహిత సంబంధాలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సందర్భంగా చర్చించారు. ఇరువురూ పరస్పరం తమ వ్యూస్‌ని షేర్‌ చేసుకున్నారు. అలాగే పాలస్తీనా విషయంలో ఇరువురూ చర్చించారు. పాలస్తీనాకు రెండు దేశాలూ సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా ఇరు దేశాల అధిపతులు తీర్మానించుకున్నారు. మిడిల్‌ ఈస్ట్‌లో శాంతిని పెంపొందించడం లక్ష్యంగా ఈ చర్చలు దోహదం చేస్తాయని ఎమిర్‌ షేక్‌, జాకోబ్‌ జుమా చెప్పారు. తమ దేశం ఖతారీ బిజినెస్‌ మెన్‌కు రెడ్‌ కార్పెట్‌ వేస్తుందని సౌతాఫ్రికా అధిపతి వివరించారు. ఖతారీ వ్యాపారవేత్తలకు అలాగే తమ వ్యాపార వేత్తలకు మధ్య బ్రిడ్జ్‌ కోసం సహాయ సహకారాలు అదిస్తామని జాకోబ్‌ జుమా చెప్పారు. 22 ఏళ్ళుగా ఖతార్‌తో తమ సంబంధాలు బలంగా ఉన్నాయని ఆయన అన్నారు. ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ మినిస్టర్‌ రోబ్‌ డేవిస్‌, సౌతాఫ్రికా ఎప్పుడూ ఖతార్‌తో ట్రేడ్‌ సంబందాల్ని బలోపేతం చేయడానికి ఆసక్తి చూపుతుందనీ, ఆ కారణంగానే తమ సంబంధాలు బలంగా తయారయ్యాయని వివరించారు. ఎల్‌ఎన్‌జి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగాల్లో కలిసి ముందుకు వెళుతున్నామని ఇరు దేశాల ప్రముఖులు చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com