లులూ హైపర్‌మార్కెట్ లో వరల్డ్ ఫుడ్ ఫెస్టివల్‌ ప్రారంభం

- September 29, 2023 , by Maagulf
లులూ హైపర్‌మార్కెట్ లో వరల్డ్ ఫుడ్ ఫెస్టివల్‌ ప్రారంభం

కువైట్: వరల్డ్ ఫుడ్ ఫెస్టివల్‌ లులూ హైపర్‌మార్కెట్  లో ప్రారంభమైంది. ఇది కువైట్‌లోని హైపర్‌మార్కెట్‌లోని అన్ని అవుట్‌లెట్‌లలో సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 3 వరకు కొనసాగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆహార ఉత్పత్తుల వారోత్సవ వేడుకను సెప్టెంబర్ 27న అల్‌రై అవుట్‌లెట్‌లో ప్రముఖ భారతీయ సినీ నటి రజిషా విజయన్,  కువైట్‌లోని ప్రముఖ అరబిక్ చెఫ్ మిమీ మురాద్, లులు కువైట్ టాప్ మేనేజ్‌మెంట్ మరియు ఈవెంట్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.  దాదాపు 50 మంది పోటీదారులు ‘టేస్ట్ & విన్’ పోటీలో పాల్గొన్నారు. మొదటి స్థానంలో నిలిచిన విజేతకు KD100 విలువైన బహుమతి వోచర్‌ను అందించగా, రెండవ మరియు మూడవ స్థానంలో నిలిచిన విజేతలకు వరుసగా KD75 మరియు KD 50 విలువైన బహుమతి వోచర్‌లను అందించారు. పోటీలో పాల్గొన్న మిగతా వారందరూ కన్సోలేషన్ బహుమతులను అందజేశారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com