జనసేన పార్టీ బహ్రెయిన్ కన్వీనర్ గా రాయుడు వెంకటేశ్వరరావు
- September 29, 2023
మనామా: జనసేన పార్టీ బహ్రెయిన్ ప్రాంతీయ కన్వీనర్ గా ఆలమూరు మండలం చెముడు లంక గ్రామానికి చెందిన రాయుడు వెంకటేశ్వరరావును నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది.జనసేన పార్టీ గల్ఫ్ దేశాల ప్రాంతీయ కన్వీనర్లను నియమిస్తూ గురువారం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తర్వులు జారీ చేశారు.దీనిలో భాగంగా బహ్రెయిన్ లో ఉద్యోగరీత్యా స్థిరపడిన రాయుడు వెంకటేశ్వరరావు గల్ఫ్ దేశాల జనసేన పార్టీ కార్యకలాపాల్లో చురుకైన పాత్రను పోషిస్తున్నారు.పార్టీ కార్యకర్తలు చురుకుగా పాల్గొంటున్నరాయుడు వెంకటేశ్వరరావు సేవలను పార్టీ గుర్తించి బహ్రెయిన్ ప్రాంతీయ కన్వీనర్ గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.బహ్రెయిన్ ప్రాంతీయ కన్వీనర్ గా నియమితులైన రాయుడు వెంకటేశ్వర రావు ను కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు అభినందించారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







