బలూచిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి..52 మంది మృతి

- September 29, 2023 , by Maagulf
బలూచిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి..52 మంది మృతి

కరాచీ: పాకిస్థాన్‌ లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌ లో శక్తిమంతమైన బాంబు పేలుడు  సంభవించింది. ఓ మసీదు ప్రాంగణంలో జరిగిన ఈ ఘటనలో కనీసం 52 మంది మరణించినట్లు పాక్‌ మీడియా కథనాలు వెల్లడించాయి.

మృతుల్లో ఓ పోలీసు ఉన్నతాధికారి కూడా ఉన్నారు. ఈ ఘటన ఆత్మాహుతి దాడిగా తెలుస్తోంది.మిలాద్‌ ఉన్‌ నబీని పురస్కరించుకుని మస్తుంగ్‌ జిల్లాలోని ఓ మసీదు వద్ద శుక్రవారం మధ్యాహ్నం ర్యాలీ నిర్వహించారు. ఇందులో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొని ప్రార్థనలు చేశారు. ఆ సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 52 మంది మృతిచెందగా.. మరో 50 మందికి పైగా గాయపడినట్లు పాక్‌ మీడియా వెల్లడించింది. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఈ ర్యాలీ పర్యవేక్షణ విధుల్లో ఉన్న డీఎస్పీ నవాజ్‌ గాష్కోరి కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. డీఎస్పీ కారు వద్దే పేలుడు సంభవించినట్లు తెలిపారు. ఆత్మాహుతి దాడిగా ప్రాథమికంగా నిర్ధారించినట్లు పేర్కొన్నారు. ఓ సూసైడ్‌ బాంబర్‌ డీఎస్పీ కారు పక్కనే నిలబడి తనను తాను పేల్చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనాస్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com