గల్ఫ్ లో ఎఫ్టీపీసీ ఇండియా తొలి అడుగు
- September 29, 2023
దుబాయ్: పాన్ ఇండియాలో ఫిలిం టూరిజానికి ఎంతో కృషి చేస్తున్న ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (FTPC India) గ్లోబల్‌లో తమ విస్తరణను కొనసాగిస్తుంది. దుబాయ్ మరియు గల్ఫ్ దేశాలకు ఎఫ్టీపీసీ ఇండియా చిత్తర్వు శ్రీకాంత్‌ను కో-ఆర్డినేటర్‌గా, జ్యూరి మెంబర్‌గా నియమించినట్లు ఎఫ్టీపీసీ ఇండియా అధ్యక్షులు చైతన్య జంగా, కార్యదర్శి పీవీఎస్ వర్మ శుక్రవారం సంయుక్త ప్రకటనలో తెలిపారు.గల్ఫ్ దేశాలు అయిన యూఏఈ,ఒమన్,సౌదీ అరేబియా,కువైట్,ఖతార్,బహ్రెయిన్ లో భారతీయ చలనచిత్ర పరిశ్రమ టెక్నిషియన్స్‌కు సాంకేతిక సహకారాలు అందజేయడంలో ఇది ఎంతో దోహదపడుతుందని తెలిపారు. అలాగే భవిష్యత్తులో మరిన్ని దేశాలకు కో-ఆర్డినేటర్లను నియమించి విశ్వవ్యాప్తంగా తన ఉనికిని ఎఫ్టీపీసీ ఇండియా చాటుకుంటుందన్నారు. ఫిలిం సమ్మిట్స్ను ఏర్పాటు చేయడం, ఫిలిం టూరిజాన్ని అభివృద్ధి చేయడం, ఫిలిం ఇండస్ట్రీలో అందరికీ అవకాశాలు కల్పించడంలో తమ సంస్థ ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







