రియాద్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్.. 32 దేశాల నుండి 1,800 ప్రచురణ సంస్థలు
- September 29, 2023
రియాద్: కింగ్ సౌద్ యూనివర్శిటీ క్యాంపస్‌లో గురువారం ప్రారంభమైన రియాద్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 2023లో ప్రపంచవ్యాప్తంగా 32 దేశాల నుండి 1,800 కంటే ఎక్కువ ప్రచురణ సంస్థలు తమ తాజా ప్రచురణలను ప్రదర్శిస్తున్నాయి. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సౌదీ సాహిత్యం, ప్రచురణ మరియు అనువాద కమీషన్ నిర్వహించిన ‘స్పూర్తిదాయకమైన గమ్యస్థానం’ అనే నినాదంతో 10 రోజులపాటు ఈ ఫెస్టివల్ కొనసాగనుంది. "రియాద్ రీడ్స్ ఫ్రెంచ్" చొరవలో భాగంగా 70 ఫ్రెంచ్ పబ్లిషింగ్ హౌస్‌లు భాగస్వామ్యం అయ్యాయి. ఇందులో అరుదైన మాన్యుస్క్రిప్ట్‌లు, కళాఖండాల ప్రత్యేక ప్రదర్శన, 25 కంటే ఎక్కువ కళాత్మక పెయింటింగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. అక్టోబరు 7 వరకు జరగనున్న ఈ ఫెయిర్‌లో పది లక్షల మందికి పైగా పుస్తక అభిమానులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ సందర్భంగా 200కి పైగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







