ఎక్స్‌పో సిటీలో ‘గార్డెన్ ఇన్ ది స్కై’ తాత్కాలికంగా మూసివేత
- October 01, 2023
దుబాయ్: ఎక్స్‌పో సిటీ దుబాయ్ తన రెండు ప్రసిద్ధ ఆకర్షణలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. "గార్డెన్ ఇన్ ది స్కై మరియు రషీద్స్ ప్లేగ్రౌండ్" అక్టోబర్ 1 నుండి తాత్కాలికంగా "పాజ్" చేయబడుతుందని తెలిపింది. వాటిని తిరిగి ఎప్పుడు తెరుస్తారో వెల్లడించలేదు. ఈ సంవత్సరం మే నెలలో ఎక్స్‌పో సిటీ దుబాయ్ సాధారణ నిర్వహణ కోసం గార్డెన్ ఇన్ ది స్కైని తాత్కాలికంగా మూసివేసింది. ఆగస్టు నెల ప్రారంభంలో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది.
'గార్డెన్ ఇన్ ది స్కై' అనేది తిరిగే పరిశీలన టవర్. ఇది సందర్శకులను భూమి నుండి 55 మీటర్ల ఎత్తులో పైకి తీసుకెళ్లుతుంది. ఇది నగరం వ్యూని అందిస్తుంది. జూబ్లీ పార్క్‌లోని రషీద్ ప్లేగ్రౌండ్ పిల్లలకు ప్రత్యేకం. ఇది సముద్ర-నేపథ్య సాహసం, స్ప్రింగ్‌లపై సొరచేపలు, వేల్ స్లైడ్‌లు, ఓషన్ లైనర్లు , ఇంటరాక్టివ్ 3D చిట్టడవి నమూనాను కలిగి ఉంటుంది.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







