అక్టోబర్ 07 వరకు రూ.2000 నోట్లు మార్పిడి చేసుకోవచ్చు
- October 01, 2023
ముంబై: రూ.2000 నోట్లు మార్పిడి విషయంలో RBI కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు తో రూ.2000 నోట్లు మార్పిడి ముగియనుండగా..RBI మరో వారం రోజుల వరకు మార్పిడి తేదీని పొడగించింది. గతంలో తీసుకువచ్చిన రూ.2000 కరెన్సీ నోట్లను ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు, లేదా మార్కెట్లో మార్చుకునేందుకు సెప్టెంబరు 30వ తేదీని గడువుగా విధించింది. కానీ చాలామంది బ్యాంకులకు వరుస సెలవులు ఉండడం తో పెద్ద నోట్లను మార్చుకునేందుకు వీలు పడలేదు. దీంతో మరో వారం గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది.
అలాగే ఆర్బీఐ కొన్ని కీలక సూచనలు తెలియజేసింది..అవి ఏంటి అంటే
అక్టోబరు 8 నుంచి రూ.2000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి, మార్చుకోవడానికి ఎంతమాత్రం అనుమతించరు.
అక్టోబరు 8 నుంచి… వ్యక్తులు కానీ, సంస్థలు కానీ 19 ఆర్బీఐ కార్యాలయాల వద్ద రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు. అయితే, ఒక్కసారికి రూ.20 వేల వరకే మార్చుకునేలా పరిమితి విధించారు.
నిర్దేశిత 19 ఆర్బీఐ కార్యాలయాల వద్ద వ్యక్తులు కానీ, సంస్థలు కానీ రూ.2000 నోట్లను తమ బ్యాంకు ఖాతాల్లోకి డిపాజిట్ చేసుకోవచ్చు.
వ్యక్తులు కానీ, సంస్థలు కానీ తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను నిర్దేశిత ఆర్బీఐ కార్యాలయాలకు పోస్టులో పంపడం ద్వారా కూడా డిపాజిట్ చేసుకోవచ్చు.
ఈ లావాదేవీలన్నీ ప్రభుత్వ, ఆర్బీఐ నిబంధనలకు లోబడి జరుగుతాయి. ప్రజలు తమ ధ్రువీకరణ పత్రాలను సమర్పించి, నిర్దిష్ట విధివిధానాలను పాటించాల్సి ఉంటుంది.
ఇక, కోర్టులు, దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, ఇతర ప్రభుత్వ వర్గాలు తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను ఎలాంటి పరిమితి లేకుండా 19 ఆర్బీఐ కేంద్రాల్లో డిపాజిట్ చేయవచ్చు.
తాజా వార్తలు
- క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!