ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన సౌదీ అథ్లెట్ యూసఫ్

- October 02, 2023 , by Maagulf
ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన సౌదీ అథ్లెట్ యూసఫ్

హాంగ్‌జౌ:  చైనాలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో సౌదీ రన్నర్ యూసఫ్ మస్రాహి పురుషుల 400 మీటర్ల రేసులో 45.55 సెకన్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని సౌదీ అరేబియాకు తొలి బంగారు పతకాన్ని అందించాడు. అతను బహ్రెయిన్‌కు చెందిన యూసఫ్ అల్-అబ్బాస్, జపాన్‌కు చెందిన కాంటారో సాటో నుండి తీవ్రమైన పోటీని ఎదుర్కొన్నాడు. తొమ్మిదేళ్ల క్రితం 2014లో ఇంచియాన్‌లో స్వర్ణం గెలిచింది సౌదీ అరేబియా.  ఈ సందర్భంగా మస్రాహి మాట్లాడుతూ.. "నేను ఈ విజయాన్ని సౌదీలందరికీ అంకితం చేస్తున్నాను. నా తల్లి, కెప్టెన్ హమ్దాన్ అల్-బిషికి ప్రత్యేక ధన్యవాదాలు." అని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com