బతుకమ్మ వేడుకల పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత
- October 03, 2023
హైదరాబాద్: భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఈనెల 21న యూకేలో జరగబోయే బతుకమ్మ వేడుకల పోస్టర్‌ను మంగళవారం జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ..బతుకమ్మకు అంతర్జాతీయంగా గుర్తింపు తేవడంలో విదేశాల్లో ఉన్నటువంటి భారత్ జాగృతి కార్యకర్తలు విశేషంగా కృషి చేశారని తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు పండగలకు వివిధ దేశాల్లో ప్రాచుర్యం కలగడం సంతోషంగా ఉందని తెలిపారు. బతుకమ్మ వేడుకలకు హాజరయ్యే మహిళలకు ఉచితంగా చేనేత చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించిన భారత జాగృతి యూకే విభాగాన్ని కల్వకుంట్ల కవిత అభినందించారు.
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జాగృతి యూకే అధ్యక్షుడు బల్మురి సుమన్, టీ ఎస్ ఫుడ్స్ చైర్మన్ అండ్ భారత్ జాగృతి వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ సాగర, భారత్ జాగృతి జనరల్ సెక్రెటరీ నవీన్ ఆచారి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత అనేక సంవ త్సరాలుగా భారత్ జాగృతి ఆధ్వర్యంలో వివిధ దేశాల్లో బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్న విషయం విధితమే. అందులో భాగంగా ప్రతి ఏటా భారత్ జాగృతి యూకే విభాగం ఆ దేశంలో మెగా బతుకమ్మ పేరిట వేడుకలు నిర్వహిస్తున్నది. ఈ నెల 21న నిర్వహించబోయే వేడుకలకు పెద్ద ఎత్తున తెలంగాణ వారితోపాటు, ప్రవాసీ భారతీయులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







