బంపర్ ఆఫర్ ఇస్తున్న ఎయిర్ ఇండియా
- May 21, 2016
విమానసంస్థల్లో ధరల యుద్ధం మరింత జోరుగా సాగుతోంది. విమానయాన సంస్థలు ఆకర్షణీయమైన చార్జీల తగ్గింపుతో ప్రయాణీకులకు ఆకట్టుకోవడానికి భారీ ఆఫర్లు అందిస్తున్నాయి. మొన్న స్సైస్ జెట్, ఇండిగో వరుసగా అతి తక్కువ చార్జీలను ఆఫర్ చేయగా ఇపుడు ఎయిర్ ఇండియా వంతువచ్చింది. పరిమిత కాలానికి గాను సూపర్ సేల్ ఆఫర్ ను ప్రవేశపెట్టింది. తన దేశీయ నెట్ వర్క్ లో రూ 1,499 (అన్ని కలుపుకొని)ప్రారంభ ధరతో వినియోగదారులకు టికెట్లను అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సూపర్ సేల్ ఆఫర్ కింద ఈ శనివారం నుంచి మే 25 లోగా టిక్కెట్లు బుక్ చేసుకోవాలని తెలిపింది. ఇవి జూలై , సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణ కాలానికి వినియోగించుకోవాలని పేర్కొంది.
jexe మిగిలిన సమయంతో పోలిస్తే జూలై-సెప్టెంబర్, జనవరి-మార్చి త్రైమాసికాల్లో డిమాండ్ తక్కువగా ఉంటుంది. ఈ కాలాన్ని లీన్ సీజన్ భావిస్తారు. ఈ నేపథ్యంలో స్సైస్ జెట్ , ఇండిగో, ఎయిర్ ఆసియా ఇండియా భారీ ఆఫర్ ప్రకటించింది. స్పైస్జెట్ టికెట్ రూ 511 ఇండిగో రూ .800 ఆఫర్ వచ్చింది. అటాగే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎయిర్ ఏసియా పలు మార్గాల్లో సగానికి దాని టికెట్ ధరలు తగ్గించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- పెట్టుబడి ఒప్పందాలు వేగంగా అమల్లోకి రావాలి: సీఎం రేవంత్
- 'KHDA' ని సందర్శించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తెలంగాణ: ఆరుగురు సీనియర్ ఐపీఎస్ లకు పదోన్నతి
- కొత్త మెట్రో లైన్ నిర్మాణాన్ని ప్రకటించిన దుబాయ్ ప్రభుత్వం
- రూ.102 కోట్ల కేసులో రన్యాకు ఊరట
- మే 1 నుంచి ఆన్లైన్ గేమింగ్‌పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!
- భారత్‌కు ఇరాన్ మరో షాక్..
- బహ్రెయిన్‌లో తల్లి ప్రాణాలను కాపాడిన 6 ఏళ్ల చిన్నారి..!!
- రూమర్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- వాట్సాప్ ఉపయోగించకుండా బ్యాంకులపై యూఏఈ నిషేధం..!!









