ప్రపంచంలోని టాప్ 10 నగరాల్లో దుబాయ్
- October 05, 2023
యూఏఈ: రెసొనెన్స్ విడుదల చేసిన వరల్డ్స్ బెస్ట్ సిటీస్ రిపోర్ట్ ప్రకారం.. నివాసం, ప్రేమ, శ్రేయస్సు కోసం ప్రపంచంలోని టాప్ 10 ఉత్తమ నగరాల్లో ఒకటిగా దుబాయ్ నిలిచింది. ఈ జాబితాలో శాన్ ఫ్రాన్సిస్కో, ఆమ్‌స్టర్‌డామ్, లాస్ ఏంజిల్స్, వాషింగ్టన్, ఇస్తాంబుల్, వియన్నా, టొరంటో, బోస్టన్, మెల్‌బోర్న్, జ్యూరిచ్, సిడ్నీ అనేక ఇతర నగరాల కంటే దుబాయ్ నివసించడానికి, పని చేయడానికి, అభివృద్ధి చెందడానికి ఉత్తమమైన నగరంగా రేటింగ్ పొందింది. ఈ జాబితాలో లండన్ అగ్రస్థానంలో ఉండగా.. పారిస్, న్యూయార్క్, టోక్యో, సింగపూర్, దుబాయ్, శాన్ ఫ్రాన్సిస్కో, బార్సిలోనా, ఆమ్‌స్టర్‌డామ్ మరియు సియోల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రసిద్ధమైన ల్యాండ్‌మార్క్‌లు, ఉద్యానవనాలు, విమానాశ్రయ కనెక్టివిటీ, మ్యూజియంలు, నైట్‌లైఫ్, రెస్టారెంట్లు, షాపింగ్, ఫార్చ్యూన్ 500 గ్లోబల్ కంపెనీలు, స్టార్టప్‌ల సంఖ్య పరంగా దుబాయ్ మెరుగైన మార్కులు సాధించింది. జీసీసీ నగరాల్లో అబుదాబి అరబ్ ప్రపంచంలో రెండవ స్థానంలో.. ప్రపంచవ్యాప్తంగా 25వ స్థానంలో ఉంది. ఆ తర్వాత రియాద్ (28), దోహా (36), కువైట్ (58) మరియు మస్కట్ (89) ఉన్నాయి.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్‌కోచ్‌లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









