బహ్రెయిన్‌లో ఐఐటీ-సర్టిఫైడ్ ఎమర్జింగ్ టెక్ కోర్సులు ప్రారంభం
- October 05, 2023
బహ్రయిన్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ ప్రవర్తక్ ఫౌండేషన్ సహకారంతో ప్లాజా టెక్నాలజీస్‌లో అత్యాధునికమైన ఐఐట-సర్టిఫైడ్ కోర్సులు ప్రారంభమయ్యాయి. IIT మద్రాస్ భారతదేశంలోని ఎనిమిది పబ్లిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌లో ఒకటిగా ఎంపికైంది. 1959లో స్థాపించబడిన IIT మద్రాస్..2016లో ప్రారంభమైనప్పటి నుండి భారత విద్యా మంత్రిత్వ శాఖ నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF)లో ప్రీమియర్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్గా అగ్ర స్థానాన్ని పొందింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సైన్స్, క్రిప్టోకరెన్సీ, సైబర్‌సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్, బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్‌తో సహా ఇన్నోవేషన్‌లో ముందంజలో ఉన్న సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లను బహ్రెయిన్ లో ప్రోత్సహించడానికి మెక్ఇండిజ్ (McIndeez) కన్సల్టెన్సీతో ప్రత్యేకమైన భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా భారత రాయబారి వినోద్ కె. జాకబ్, SME డెవలప్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ హెచ్.ఇ. షేఖా అబ్దుల్లా అల్ఫాదేల్, మెక్ఇండిజ్ అకాడమీ వ్యవస్థాపకుడు మరియు డైరెక్టర్ అయిన లతా ఉన్నికృష్ణన్ తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







