కృష్ణ బయోపిక్‌.! సై అంటోన్న సుధీర్ బాబు.!

- October 05, 2023 , by Maagulf
కృష్ణ బయోపిక్‌.! సై అంటోన్న సుధీర్ బాబు.!

లెజెండరీ నటుల బయోపిక్స్‌లో నటించాలంటే కాస్త ఆచి తూచి వ్యవహరించాల్సిందే. తెలుగులో నట విశ్వరూపం దివంగత ఎన్టీయార్ బయోపిక్‌లో ఆయన తనయుడు బాలకృష్ణ నటించిన సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌ని రెండు పార్టులుగా రిలీజ్ చేసిన సంగతి కూడా తెలిసిందే.

కానీ, రెండు పార్టులూ ఫెయిల్యూర్ అయ్యాయ్. ఫెయిల్యూర్ సంగతి పక్కన పెడితే, ఆయన పరువు తీసేశాడు బయోపిక్ ద్వారా.. అంటూ బాలయ్యపై దారుణంగా ట్రోల్స్ జరిగాయ్.

అందుకే అలాంటి లెజెండరీ నటుల జీవిత గాధలను వెండితెరపై ఆవిష్కరించేందుకు గట్స్ వుండాలి. అలాగే చాలా జాగ్రత్తలు తీసుకోవల్సిన ఆవశ్యకత కూడా వుండాలి.

ఈ ముచ్చట ఇప్పుడెందుకంటారా.? చాన్నాళ్లుగా కృష్ణ బయోపిక్ తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయ్. కానీ, ఆ పాత్రలో కనిపించే నటుడి విషయంలో సందిగ్థత కారణంగా ఈ బయోపిక్ రూపుదాల్చడం లేదు. తండ్రి పాత్రలో తనయుడు మహేష్ బాబు నటిస్తే ఇక అంతకన్నా ఇంకేముంటుంది.? అని కొందరు అభిప్రాయపడ్డారు.

కానీ, నా దేవుడి పాత్రలో నేను కనిపించే సాహసం చేయలేనని మహేష్ బాబు తేల్చేశారు. అయితే, ఘట్టమనేని అల్లుడు విలక్షణ నటుడు అయిన సుధీర్ బాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్సష్టం చేశారు తాను కృష్ణగారి బయోపిక్‌లో నటించేందుకు సిద్ధంగా వున్నానని.

బయోపిక్‌లో నటించడం అంటే.. కేవలం ఆయా వ్యక్తుల హావభావాల్ని పట్టడం  మాత్రమే కాదు.. సోల్‌ని పట్టుకోవాలి. అది నేను చేయగలను. అందుకే ఆ అవకాశం వస్తే.. నటించేందుకు తాను సిద్ధంగా వున్నానని సుధీర్ బాబు తెలిపారు. ప్రస్తుతం ఆయన ‘మామా మశ్చింద్ర’ చిత్రంలో నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com